రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవ్వబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి స్టేజ్ కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద నగరాలకు, చిన్న నగరాలకు, పట్టణాలకు వ్యాక్సిన్లు చేరాయి. వీటిలో కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ ఈ రెండు టీకాలు ఉన్నాయి. రేపు మొదలవ్వబోయేఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్ 1075 ను కూడా ఏర్పాటుచేశారు. వ్యాక్సినేషన్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అధికారులు పర్యవేక్షించనున్నారు.