29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25 కిలోల బంగారు ఆభరణాలను, 7 తుపాకులు, బుల్లెట్లు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ శ‌నివారం మీడియాకు చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తులు ఈ ముఠాలో ఉన్నార‌ని, నాగ్‌పూర్ పోయే క్రమంలో వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. దొంగిలించిన బంగారాన్ని త‌ర‌లించేందుకు ఉప‌యోగించిన లారీ, కంటైన‌ర్‌, సుమోల‌ను సీజ్ చేశామ‌న్నారు. పెద్ద‌పెద్ద షాపుల్లో వాటి యాజ‌మాన్యాలు సీసీటీవీ కెమెరా నెట్‌వ‌ర్క్ తోపాటు అలారం వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని స‌జ్జ‌నార్ ఈ సందర్భంగా సూచించారు.

- Advertisement -

Latest news

Related news