మొబైల్లో డేటా సరిపోక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అన్లిమిటెడ్ ప్లాన్స్ లో వచ్చే 1జీబీ 1.5జీబీ డేటా ఒక్క నెట్ ఫ్లిక్ ఎపిసోడ్ కే సరిపోతుంది. అందుకే ఇప్పుడు చాలామంది సడెన్‌గా డేటా అయిపోయినప్పుడు డేటా కోసం అదనంగా రీచార్జ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఏంటంటే..
జియో డేటా ప్లాన్స్
టెలికాం రంగంలో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తక్కువ ధరకే డేటాను అందిస్తుంది. రూ. 11లకే 1GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.21కు 2జీబీ డేటాను అందిస్తుంది. అయితే 2జీబీ ప్లాన్‌లో డేటాను ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకూ వాడుకోవచ్చు.
వి డేటా ప్లాన్స్
వోడాఫోన్, ఐడియా కలిసి ‘వి’ గా రూపాంతరం చెందిన తర్వాత ‘వి’ మంచి ప్లాన్స్ ఆఫర్ చేస్తుంది. రూ. 16లకే 1GB డేటాను అందిస్తుంది. అయితే ఈ డేటాను 24 గంటల్లోపే వాడుకోవాలి. దీనితో పాటు రూ. 48లకు 3జీబీ డేటా వస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
ఎయిర్టెల్ డేటా ప్లాన్స్
మన దేశంలో బెస్ట్ నెట్వర్క్ ప్రొవైడర్‌గా ఎయిర్ టెల్ దూసుకెళ్తోంది. ఎయిర్టెల్ రూ.48లకు.. 28 రోజుల వ్యాలిడిటీ గల 3GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.78 ప్లాన్ అయితే 5GB డేటా లభిస్తుంది.
