కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి 26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా అంగీకరించారని స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతో కలిసి ఓ అవగాహనకు వచ్చామన్నారు. ఈ అవగాహన ప్రకారం జనవరి 26న ఢిల్లీలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే కిసాన్ పరేడ్ కు పాల్గొనే ట్రాక్టర్లను ఢిల్లీ వీధుల్లోకి అనుమతిస్తారన్నారు. అయితే, ఢిల్లీలోని ఏ దారుల్లో పరేడ్ నిర్వహించాలనే విషయంపై ఈ రాత్రికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
కొత్త సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య నిన్న జరిగిన 11వ విడుత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 26న కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహించేందుకు రైతు సంఘాలు సమాయత్తమవుతున్నాయి. రైతుల పరేడ్ అంశం పోలీసుల పరిధిలోనిదని సుప్రీంకోర్టు, కేంద్రం అభిప్రాయపడిన నేపథ్యంలో శనివారం రైతు సంఘాల నేతలు ఢిల్లీ పోలీసుల కలిసి అనుమతి కోరారు.