29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

దాడి చేసింది మేమే.. ప్రూఫ్స్ లేనిదే నమ్మలేం..

ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక దీని వెనక ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందేమో అని దర్యాప్తు చేస్తున్న టైంలో దాడి చేసింది మేమే అంటూ జైష్‌ ఉల్‌ హింద్‌ అనే ఉగ్రవాద సంస్థ సోషల్‌ మీడియాలో ప్రకటన చేసింది. అయితే.. ఇప్పటి వరకు ఈ సంస్థ పేరు ఎప్పుడు, ఎక్కడా వినలేదని అధికారులు అంటున్నారు.


జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ఈ దాడి మేమే చేశాం అంటూ టెలిగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కొన్ని వైరల్ అయ్యాయి. అందులో.. “జైష్‌ ఉల్‌ హింద్‌ సైనికులు ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకుని వెళ్లి.. ఈ దాడి చేశారు. భారతదేశం చేసిన దాడులకు ప్రతీకారంగా అల్లా ఆజ్ఞతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి. భారతదేశంలోని ముఖ్యమైన నగారలను టార్గెట్ చేసుకుని ఈ తరహా దాడులు చేస్తాం. వెయిట్ చేయండి” అని ఆ పోస్ట్ ల్లో ఉంది. అయితే ఇదంతా దర్యాప్తుని తప్పదోవ పట్టించే ప్రయత్నాలు అయ్యి ఉండవచ్చని అధికారులు అంటున్నారు. సరైన ఆధారాలు లభించే వరకు దాడి చేసింది జైష్‌ ఉల్‌ హింద్‌ సంస్థ అని నమ్మలేం అంటున్నారు.

- Advertisement -

Latest news

Related news