29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఢిల్లీలో ఇప్పుడెలా ఉంది?

ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్రం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ ఎత్తున బలగాలను దింపారు. అన్ని మార్గాలనూ మూసేసి, పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటుచేశారు. రోడ్లపై ఇనుప మేకులు గుచ్చిన షీట్లను ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రైతు సంఘాలు.. తమపై సాగిస్తున్న వేధింపులు ఆపితేనే తిరిగి చర్చలకు వస్తామని తేల్చిచెప్పాయి.
“కేంద్రం మాపై కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోంద”ని సంయుక్త కిసాన్‌ మోర్చా అంటోంది. “సిమెంటు గోడలు, ముళ్ల కంచెలు, మేకులతో కూడిన ఉచ్చులు, ఇనుప రాడ్లు, గొలుసుకట్లు.. ఇవన్నీ ఏంటీ? మేమేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చినవాళ్లమా? మంచి నీళ్లు లేవు,వంట వార్పు లేవు, విద్యుత్ లేదు.. ఈ వేధింపులు ఆపేదాకా, అక్రమంగా జైళ్లలో పెట్టిన మా రైతులను విడిచిపెట్టేదాకా ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రశ్నేలేదు” అని సంయుక్త కిసాన్‌ మోర్చా చెప్పింది. దీనికి స్పందిస్తూ.. రిపబ్లిక్ డే ఘటనలాంటిది మళ్లీ జరిగితే ఎవరిది బాధ్యత? అని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీవాస్తవ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రిపబ్లిక్‌ డే నాటి హింసపై దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది.
జరుగుతున్నఈ పోరాటం ఎప్పటివరకూ సాగినా రైతులు దానికి సిద్ధంగా ఉండాలని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. “ఈ ఏడాది అక్టోబరు-నవంబరు దాకా ఇది సాగవచ్చు. చేసిన చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఇళ్లకు వెళ్లేది లేదు” అని ఆయన అన్నారు.

- Advertisement -

Latest news

Related news