29.3 C
Hyderabad
Monday, March 1, 2021

మేకుల పక్కనే పూల మొక్కలు

72 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు శనివారం దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రెడీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధం జరుగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో రాస్తారొకో జరనుందని చెప్పారు.
రాస్తా రోకో సమయంలో వాహనాల్లో చిక్కుకున్న ప్రజలకు మంచినీళ్లు, స్నాక్స్‌ అందజేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దాని గురించి మాట్లాడుతూ.. “నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ను మాత్రమే దిగ్బంధిస్తాం. స్కూలు బస్సులు, అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు ఆటంకం కలిగించము. ప్రజలతో గానీ, అధికారులతో గానీ రైతులెవరూ ఘర్షణలకు దిగకూడదు. ఆందోళన ప్రశాంతంగా సాగుతుంది. 3 గంటలకు రాస్తారొకో ముగిసే టైంలో వాహనాల హారన్లను ఓ నిమిషం పాటు మోగించాలి” అని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా తెలిపింది.


పూల మొక్కలు నాటి..
సింఘూ సరిహద్దు దగ్గర రైతులను కదలనివ్వకుండా పోలీసులు రోడ్లపై మేకుల ఉచ్చులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ఉచ్చులు ఉన్న చోట రైతు మనసును చాటి చెప్పేలా పూల మొక్కలను నాటారు. అలాగే పశ్చిమ యూపీ నుంచి రైతులు ఇంకా ఢిల్లీ బోర్డర్స్ కు వస్తూనే ఉన్నారు. యూపీ, పంజాబ్, రాజస్థాన్ లోనూ పంచాయతీలు జరుగుతున్నాయి. వాటికి వేల సంఖ్యలో రైతులు హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా.. పది రాష్ట్రాలకు చెందిన మార్కెటింగ్‌ బోర్డులు, మండీ ఆపరేటర్లు, ప్రతినిధులతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ శుక్రవారం చర్చలు జరిపింది.

- Advertisement -

Latest news

Related news