18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

వాట్సప్ సమాచారం గూగుల్ సెర్చ్ లో..?

వాట్సప్ గ్రూపులో భద్రంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం గూగుల్ సెర్చ్ లో కనిపించడంతో వాట్సప్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై చర్చ జరుగుతోంది. ఇంతకుముందు ఇదే అంశంపై విమర్శలు రావడంతో 2019లోనే ఈ ఇష్యూను వాట్సప్ టీమ్ సాల్వ్ చేసింది. అయితే అదే సమస్య మళ్లీ రిపీట్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వాట్సప్  గ్రూపులో కొత్తగా ఒక వ్యక్తి జాయిన్ అయితే అతని కాంటాక్ట్ నెంబర్లు, ప్రొఫైల్ ఇమేజెస్ మొత్తం యాక్సెస్ చేసుకునే అవకాశం ఆ గ్రూపులో ఉన్న ఎవరికైనా ఉంటుంది. దీనిపై ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా స్పందించారు. గూగుల్ నుంచి యూజర్లు వాట్సప్ గ్రూపుల్లో ఎంటర్ అయ్యేందుకు అనుమతిస్తున్నాయన్నారు. గూగుల్ సెర్చ్ నుంచి వాట్సప్ గ్రూపులు జాయిన్ అవ్వొచ్చని ఇంగ్లీష్ మీడియా కన్ఫామ్ చేయడం కూడా వాట్సప్ భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోందన్నారు.

వాట్సప్ చాట్ లను ఎనేబుల్ చేసుకుని.. మనం వెతికిన దానికి తగ్గట్లు ప్రైవేట్ గ్రూప్స్ కు యాక్సెస్ కూడా ఇచ్చేయొచ్చు.. లేదా జాయిన్ అయిపోవచ్చు. గ్రూపులోకి ఇలా వచ్చిన వారిని ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోరు. అంటే ఎవరో కొత్త వ్యక్తి కాసేపు వరకూ గ్రూపులో ఉండి కాంటాక్ట్ వివరాలు.. ప్రొఫెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పటివరకూ గ్రూపు పేర్లు మాత్రమే గూగుల్ సెర్చ్ లో కనిపించినా.. ఇప్పుడు ప్రొఫైల్ పేర్లు కూడా ఇండెక్స్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు వారి ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్ పిక్చర్స్ కూడా గూగుల్ సెర్చ్ లో దొరికేస్తున్నాయి. ఈ ఇష్యూను జూన్ 2020లోనే రిపోర్ట్ చేయడం గమనార్హం.

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...