32.7 C
Hyderabad
Monday, March 1, 2021

వాళ్లేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చారా.. శ‌ర‌ద్ ప‌వార్

తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న రైతులు పాకిస్థాన్ నుంచి వచ్చారా.. వాళ్లేమైనా పాకిస్థానీయులా అంటూ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా.. మహారాష్ట్ర నలుమూలల నుండి ముంబైలోని ఆజాద్‌ మైదానానికి వచ్చిన రైతులను ఉద్దేశించి సోమవారం శరద్‌ పవార్‌ మాట్లాడారు. నటి కంగనను కలిసేందుకు కలిసేందుకు గవర్నర్ కు టైం ఉంటది, కానీ మహారాష్ట్ర రైతులను కలిసేందుకు టైం ఉండదని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారి తీరును ఎద్దేవా చేశారు. రైతులను కలవడం గవర్నర్ నైతిక బాధ్యత కాదా.. అని ప్రశ్నించారు.

- Advertisement -

Latest news

Related news