29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

బడ్జెట్ సూట్ కేసులకు ఓ చరిత్ర ఉందని తెలుసా?

పార్లమెంట్లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రసంగం, విశేషాలను తెలసుకునేందుకు యూనియన్ బడ్జెట్ పేరుతో ఓ యాప్ ను కేంద్ర ఆర్థిక  శాఖ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రసంగానికి ముందు సభలోకి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతులను తెచ్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయం ప్రకారం సూట్ కేసులు, బ్యాగులు ఇలా ఒక్కో ఆర్థిక మంత్రి తమదైన శైలిలో బడ్జెట్ ప్రతులను సభలోకి తెస్తారు. ఈ బడ్జెట్  సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా?

లేదర్ బ్యాగ్ టూ ఎర్రటి వస్త్రం

* 1947లో తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే షణ్ముఖం​ శెట్టి  లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.

* 1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​ ఉపయోగించారు.   

* 1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

* 1998-99లో ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో పార్లమెంట్‌కు వచ్చారు.

* 1991-92లో మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ఆర్థిక మంత్రిగా తొలిసారి నలుపు రంగు బ్యాగ్​ తో సభకు వచ్చారు.

* మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలను పార్లమెంటుకు తెచ్చి ప్రత్యేకంగా నిలిచారు.

* చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా.. బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు.

* 2017లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు.

* 2019 ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసులో బ‌డ్జెట్ ప్రతులను తెచ్చారు.

* 2019 జులై 5న సూట్‌కేసు సంప్రదాయానికి చెక్ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ పత్రాలు తెచ్చారు.

- Advertisement -

Latest news

Related news