29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బెంగాల్ పీఠంపై మళ్లీ దీదీనే!

మరో నాలుగు నెలల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయం సాధిస్తుందని సీ ఓటర్‌ సర్వే నివేదిక వెల్లడించింది. 158 సీట్లను సాధించి మళ్లీ బెంగాల్ పీఠంపై మమతా బెనర్జీ అధిష్టించడం ఖాయమని సర్వే పేర్కొంది. 2016లో  టీఎంసీ 211 సీట్లు సాధించింది. బీజేపీ బెంగాల్లో తన బలాన్ని 3 సీట్ల నుంచి 102 సీట్లకు పెంచుకుంటుంది. లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి కేవలం 30 సీట్లకు.. స్వతంత్రులు 4 సీట్లకు పరిమితం అవుతారని సర్వే తెల్పింది.

2016 లో టీఎంసీ ఓట్ల శాతం 44.9 శాతంగా ఉండగా.. ఈసారి ఎన్నికల్లో అది 43 శాతానికి తగ్గుతుంది. గత ఎన్నికల్లో కేవలం 10.2 శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి 37.5 శాతం ఓట్లు పెరుగుతాయి. అదే సమయంలో, లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ యొక్క ఓటు శాతం 32 శాతం నుంచి 11.8 శాతానికి పరిమితం అవుతుంది.

బెంగాల్ సీఎంగా దీదీకి 48.8 శాతం మంది మద్దతు తెలపగా.. బీజేపీకి చెందిన దిలీప్ ఘోష్‌ను 18.7 మంది, క్రికెటర్ సౌరవ్ గంగూలీకి 13.4 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news