17 C
Hyderabad
Monday, March 1, 2021

ఏ దేశంలోనైనా డాక్టర్ కోర్సు చేయొచ్చు

ప్రపంచంలో మీకు నచ్చిన కాలేజీలో డాక్టర్ కోర్సుని చదివేయొచ్చు. ఈ మేరకు విదేశాల్లో డాక్టర్ కోర్సును చదివే విద్యార్థులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎన్ఎంసీ జాబితాలో ఉన్న కాలేజీల్లోనే డాక్టర్ కోర్సును చదివేందుకు వీలుందేది. తాజాగా ఎన్ఎంసీ ఆ ఆంక్షలను తొలగించింది. ఎన్‌ఎంసీ తాజా ప్రకటించిన నిర్ణయంతో ప్రపంచంలోని ఏ మెడికల్ కాలేజీలోనైనా విద్యార్థులు కోర్సులు చదవుకోవచ్చు. అయితే, ఆ మెడికల్ కాలేజీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలకు అనుగుణంగా ఏర్పాటై ఉండాలని సూచించింది. ఆయా దేశాల్లోని మెడికల్ కాలేజీల గుర్తింపు, ఫీజులు, ఇతర సమాచారాన్ని జాగ్రత్తగా గమనించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంసీ పేర్కొంది. తాజా నిర్ణయంతో యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల మధ్య పోటీ పెరిగి.. ఫీజులు తగ్గడంతోపాటు కోర్సుల నాణ్యత పెరిగే అవకాశాలు ఉంటాయని ఎన్ఎంసీ భావిస్తోంది.

- Advertisement -

Latest news

Related news