29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

సైంటిస్టులు చెప్పిందే చేశాం

కరోనాకు ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధాని మోదీ అన్నారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై వచ్చిన విమర్శల్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.


టీకా అనుమతుల విషయంలో శాస్త్రవేత్తలు తీసుకున్న నిర్ణయానికే విలువిచ్చామని, రాజకీయ నాయకులు ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, అవన్నీ పట్టించుకోవద్దని మోదీ చెప్పారు. ప్రజల్లో వ్యాక్సిన్‌ పై ఉన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వారణాసిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.


వారణాసి జిల్లా మహిళా హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న హాస్పిటల్ మాట్రన్, నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్, డాక్టర్లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. వారందరూ తమకు వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడించారు. మోదీ ముందుగా హాస్పిటల్ మాట్రన్‌ పుష్ప దేవితో మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ సేఫ్ అన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ అంటే ఒక ఇంజక్షన్‌ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెప్తున్నాను అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా.. కరోనా టీకా సేఫ్టీ, సామర్థ్యంపై ప్రజల్లో కొన్ని అపోహలున్నాయని, టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తే ప్రజల్లో నమ్మకం కుదురుతుంది. అని ప్రధాని తెలిపారు.

- Advertisement -

Latest news

Related news