29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

డ్రాగన్‌ ఫ్రూట్‌.. సారీ! కమలం పండు

డ్రాగన్ ఫ్రూట్ మనకు ముందు నుంచీ తెలియకపోయినా.. షాపింగ్ మాల్స్ కల్చర్ పెరిగిన తర్వాత అందరికీ తెలిసింది. ఎర్రగా ఉండే ఈ పండు పేరు డ్రాగన్ ఫ్రూట్.. దానికి ఆ పేరు ఎలా ఎందుకొచ్చిందో తెలీదు కానీ.. దాని పేరులో డ్రాగన్ అని ఉండడం వల్ల ఇప్పుడు దాని పేరు మారిపోయింది. ఇప్పుడీ పండుకి కమలం అని పేరు పెట్టారు.

అమెరికాకు చెందిన ఈ పండును ఇప్పుడు చాలా దేశాల్లో సాగు చేస్తున్నారు. ఈ పండు పేరు మార్చాలని తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ను కమలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరు చైనాతో ముడి పడి ఉండడం వల్లే పేరు మార్చినట్లు సీఎం చెప్పారు. త్వరలోనే పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంటామన్నారు.

- Advertisement -

Latest news

Related news