29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

కొండ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం బైక్ అంబులెన్స్

కొండ ప్రాంతాల్లో, దారిలేని చోట అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించాలంటే అది అతికష్టంతో కూడిన పని. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే మరీ కష్టం. దీంతో సీఆర్పీఎఫ్ వినూత్న ఆలోచన చేసింది. బైక్ అంబులెన్స్ లను రూపొందించమని డీఆర్డీవోకు పలు సూచనలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి డీఆర్డీవో బైక్ అంబులెన్స్‌ను రూపొందించింది. దాడి, ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది.

ఈ బైక్ అంబులెన్స్ లను మావో ప్రభావిత ప్రాంతాలతో పాటు, వివిధ ప్రాంతాల్లో వినియోగిస్తామని సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది. అంతేకాదు.. కొండాకోనల మధ్యనున్న మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు లేని చోట నివసిస్తున్న ప్రజలకు.. ఆపత్కాలంలో వైద్య చికిత్స  అందించడానికి కూడా వీటిని ఉపయోగించనున్నామని తెలిపింది.  గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ బైక్ అంబులెన్స్ లకు రక్షిత అని నామకరణం చేశారు.

- Advertisement -

Latest news

Related news