మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్ చూడ్డానికి వెరైటీగా ఉంటుంది కదూ.. ఇలాంటి సీనే జరిగిందే కర్నాటకలో.
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కర్కాలలో జరిగిన ఓ వెడ్డింగ్ ఈవెంట్లో డ్రోన్ తాళిబొట్టును తీసుకొచ్చి అందించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. మామూలుగా అయితే.. పెళ్లిలోమంగళ సూత్రాన్ని పూజారి అందించాలి. కానీ ఉడుపి జిల్లాలోని కర్కాల ప్రాంతంలో శనివారం జరిగిన ఓ క్రైస్తవ వివాహంలో తాళిబొట్టును డ్రోన్ అందించింది. గాల్లో ఎగురుతూ వచ్చి స్టేజీపైన ఉన్న వరుడికి తాళిని అందించి వెళ్లిపోతుంది. డ్రోన్ తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని వధువు మెడలో కడతాడు వరుడు. చూసినవాళ్లంతా ఇదేదో భలే ఉందే అనుకుంటున్నారు.
The Mangalsutra for wedding arrives in drone.
— Prabhasini (@cinnabar_dust) January 16, 2021
What’s wrong with ppl? pic.twitter.com/EoVWprPCtB