29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

వచ్చే ఏడాదికల్లా.. డిజిటలైజ్ కానున్న ఓటర్ ఐడీ కార్డులు

ఆధార్ కార్డులాగే ఓటర్ ఐడీ కార్డు కూడా త్వరలోనే డిజిట‌ల్ కానుంది. డిజిటైజేష‌న్‌లో భాగంగా వ‌చ్చే ఏడాది నుంచే ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ-ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటున్నామో అలానే.. ఓటర్ ఐడీలను కూడా ఆన్ లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందే ఓటర్ కార్డులను డిజిటలైజ్ చేసే అవకాశాలున్నాయి. కొత్తగా ఓటు హ‌క్కు కోసం నమోదు చేసుకున్న వారికి నేరుగా ఈ డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌గా.. ఇంతకు ముందే ఓట‌ర్ ఐడీలు ఉన్న వాళ్లు మాత్రం ఓట‌ర్ హెల్ప్‌లైన్ యాప్‌లో ఓ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధ్యాసాధ్యాల‌ను పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాతే ఎన్నిక‌ల సంఘం దీన్ని అమలు చేయనుంది. ఓట‌ర్ ఐడీల‌ను ఓట‌ర్లకు సులభంగా చేర్చే ఉద్దేశంతోనే డిజిట‌ల్ ఐడీల‌ను తీసుకొస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్తగా ఓటు హ‌క్కు కోసం రిజిష్టర్ చేసుకున్న వాళ్లు.. రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆధారంగా ఐడీల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ డిజిట‌ల్ కార్డుపై రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఒక‌దాంట్లో ఓట‌రు పేరు, ఇత‌ర వివ‌రాలు ఉంటాయి. మ‌రో దానిలో ఓట‌ర్‌కు సంబంధించిన ప్రత్యేక‌మైన స‌మాచారం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ల‌లో ఉండే డాటా ప్రకారమే ఓటు హ‌క్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక‌సారి ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే స‌ర్వీస్ ఓట‌ర్లు, విదేశాల్లోని ఓట‌ర్లు కూడా త‌మ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఒక పోలింగ్ స్టేష‌న్ నుంచి మ‌రో పోలింగ్ స్టేష‌న్‌కు షిప్ట్ అయిన ఓట‌ర్లు, ఓటరు కార్డు కోల్పోయిన వాళ్లు కూడా దీని ద్వారా సుల‌భంగా త‌మ ఐడీని పొందవచ్చు.

- Advertisement -

Latest news

Related news

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ...

చోప్రా లైఫ్ జర్నీ.. షేర్ చేసిన అమితాబ్

పీకే, త్రీ ఇడియట్స్, సంజు, లగేరహో మున్నాభాయ్, మున్నా భాయ్ ఎంబీబీఎస్, మిషన్ కశ్మీర్, ఖామోష్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా...