ఇటీవల సోషల్ మీడియా కంపెనీలన్నీ ఏదో ఒక ప్రైవసీ ఇష్యూని ఫేస్ చేస్తూ.. జనాల్లో నెగెటివ్ అభిప్రాయాన్ని పెంచేశాయి. దీంతో జనం కూడా వాటికి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారు. వాట్సాప్‌కి ఆల్టర్నేటివ్గా సిగ్నల్‌ను ఎంచుకున్నట్టు.. ఇప్పుడు ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా మీవి అనే యాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది.

ప్రైవసీ ఉల్లంఘనలతో పాటు యూజర్లపై నిఘా ఉంచడం, అకౌంట్స్‌ను మానిప్యులేట్ చేయడం, న్యూస్ ఫీడ్ మానిప్యులేషన్స్ ఇలాంటివన్నీ ఫేస్ బుక్ ద్వారా జరుగుతన్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఫేస్‌బుక్‌పై చాలామందికి నమ్మకం పోయినట్టుంది. కొత్త సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. వీటిలో మీవి అనే సోషల్ నెట్వర్క్ యాడ్ ఫ్రీగా ఉండడంతో డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో సోషల్ మీడియా కేటగిరీ డౌన్‌లోడ్స్‌లో ఈ యాప్ నెంబర్ 1 గా ఉంది. 2016లో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ 16 మిలియన్ మంది యూజర్లు ఉన్నారు.

పర్సనల్ డేటాను కంపెనీ షేర్ చేయడానికి లేదా అమ్మడానికి ఈ యాప్‌లో వీలుండదు. అందుకే ఇది నో యాడ్స్, నో టార్గెటింగ్, నో న్యూస్ ఫీడ్ అనే కాన్సెప్ట్‌తో దూసుకుపోతుంది.