29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ప్రశ్నించిన ప్రతీసారి మంత్రులు చాయ్ కి పోయేటోళ్లు: రైతు నేత తికాయిత్

కొత్త సాగు చట్టాలపై కేంద్రానికి, రైతులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిన్ననే చక్కాజామ్ తో రైతులు మరోసారి కేంద్రానికి తమ సత్తా చూపారు. గత రెండు నెలలుగా రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో అలుపెరుగక నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 63కుపైగా రైతులు అసువులు బాసిన వెనకడుగు వేయకుండా తమ పోరాటం సాగిస్తున్నారు.

కొత్త సాగు చ‌ట్టాల‌ ర‌ద్దు చేయాల్సిందేనని రైతులు కేంద్రాన్ని కోరుతున్నారు. దాదాపు పలు దఫాలుగా కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ తో చర్చలు జరిపిన  ఫలితం మాత్రం తేలలేదు. ఇన్ని రౌండ్ల చ‌ర్చ‌లు జ‌రిగినా ఎందుకు ఫ‌లితం రావ‌డం లేదు అన్న అంశంపై తాజాగా భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు మంత్రులతో జరిగిన మీటింగ్ ఎలా సాగిందో చెబుతూ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

‘రైతుల సమస్యలపై మంత్రుల‌కు ఏమీ తెలియదు. స్లిప్పులపై రాసుకొచ్చింది.. మా ముందు చెప్పేవారు. అసలు సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా వారికి సరైన అవగాహన లేదు. ఏదైనా ప్రశ్న అడిగితే.. వెంటనే చాయ్ కోసమని లోపలికి వెళ్లేవారు. అధికారులను అడిగి వచ్చి మాతో చెప్పేవారు. తోమర్ జీ మాత్రమే సమావేశంలో మాట్లాడేవారు. పీయూష్ గోయ‌ల్ అయితే ఎప్పుడో ఓ రెండు ముక్కలు మాట్లాడేటోడు.’ అని రాకేశ్ తికాయిత్ చెప్పుకొచ్చాడు.

 ‘ప్రధాని మీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారుగా.. అని ప్రశ్నించగా.. టికాయత్ ‘అవునా.. అయితే పీఎం మోదీ ఫోన్ నెంబర్ ఇయ్యండి. నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. మంత్రులకు ఏమీ తెలియదు. నేరుగా పీఎంతోనే తేల్చుకుంటాం. రైతుల కమిటీ ఏం నిర్ణయిస్తే మేము అదే చేస్తం’ అంటూ తికాయత్ ముగించారు.

- Advertisement -

Latest news

Related news