29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన రైతు నేత

పార్లమెంట్‌లో పీఎం నరేంద్ర మోదీ సోమవారం ‘పంటలకు కనీస మద్దతు ధర ఇంతకుముందు ఉంది. ఇకపై ఉంటుంది. దీనికి తాను హామీ ఇస్తున్నాను.’ అన్న వ్యాఖ్యలకు భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రైతు నేత రాకేశ్‌ టికయిత్‌ స్పందించారు. దేశం నమ్మకాలపై నడువదని.. రాజ్యాంగం, చట్టాలపైనే నడుస్తుందని రాకేశ్‌ టికయిత్‌ అన్నారు. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో టికయిత్ మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర ఉంటుందన్న ప్రధాని దాని కోసం ఒక చట్టాన్ని చేస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ దేశంలో ఆకలి ఆధారంగా వ్యాపారాలు జరుగవని, అదే నిజమైతే ఆకలి పెరిగినప్పుడల్లా పంట ఉత్పత్తుల ధరలు ఎందుకు పెంచడం లేదు అని టికయిత్ ప్రశ్నించారు. ఆకలిపై వ్యాపారాలు చేయాలనుకునే వారిని రైతులు దేశం నుంచి తరిమికొడతారని టికయిత్ హెచ్చరించారు. 

- Advertisement -

Latest news

Related news