29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాం.. మాకు హక్కుంది!

జవనరి 26న  ఢిల్లీలో ఖచ్చితంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రాజ్యాంగం మాకు ఆ హక్కు కల్పించిందని పంజాబీ రైతు సంఘాలు తెలిపాయి. రాజ్ పథ్ లో జరిగే పరేడ్ కి భంగం కలిగించకుండా.. ఢిల్లీ శివార్లలోనే శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో అనుమతివ్వాలని కోరుతామన్నారు. ఈ విషయంలో తమ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణపై.. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును సంప్రదించగా.. ఈ విషయమై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మొదట తాము పోలీసులతో చర్చిస్తామని, వారి సూచన ప్రకారం నడుచుకుంటామని రైతు నేతలు చెప్పారు. గణతంత్ర దినోత్సవాలకు భంగం కలిగించకుండానే.. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలన్నది తమ లక్ష్యమని రైతుసంఘాలనాయకులు తెలిపారు. 26న సుమారు 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా తమ ట్రాక్టర్లతో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -

Latest news

Related news