24.1 C
Hyderabad
Thursday, January 21, 2021

ఢిల్లీలో 26న భారీ ట్రాక్టర్ ర్యాలీకి.. పిలుపిచ్చిన రైతులు

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఈ దేశం భారీ ట్రాక్టర్ ర్యాలీని చూస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. తమ డిమాండ్లు తీరేవరకు రైతులు ఢిల్లీ వదిలి వెళ్లరని.. అవసరమైతే మరో నాలుగేళ్ల వరకు తమ ఆందోళనను పొడిగిస్తారని ఆయన తెలిపారు. శుక్రవారం కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిధ్ధమేనని స్పష్టం చేసిన ఆయన.. కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలు రైతులని టెర్రరిస్టులని వ్యవహరిస్తున్నంత కాలం మా ఆందోళన ఇంకా ఉధృతమవుతుంది అని కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఈ నెల 18 న ఏ ఉత్తర్వులు జారీ చేసినా తాము కూడా అంతే స్థాయిలో స్పందిస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు వెళ్లి మరింతమంది అన్నదాతలను సమీకరిస్తామని, ఈ నెల 23 న అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 26న ఢిల్లీ శివార్లలో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్వీందర్ సింగ్ ప్రకటించగా రాకేష్ తికాయత్ మాత్రం ఆ రోజున పరేడ్ జరిగే చోటే తాము ఈ ర్యాలీని చేపడతామని ప్రకటించారు. 26న ఢిల్లీలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చూడబోతున్నారని రాకేష్ తికాయత్ అన్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...