18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

చట్టాలు రద్దుచేసే వరకు ఢిల్లీలోనే.. 23వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం 23వ రోజుకు చేరింది. ఢిల్లీ-హర్యాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ ప్రాంతంలో వేలాది మంది అన్నదాతలు బైఠాయించి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో కూడా వేలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసేదాకా వెనక్కితగ్గేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. ప్రధాని మోదీ తమతో మాట్లాడాలని, చట్టాలని ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పోరాటాన్ని ఆపమని  తేల్చి చెప్తున్నారు. ఉద్యమాన్ని కొనసాగించేందుకు మరిన్ని రోజులు సరిహద్దుల్లోనే ఉండేలా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

రైతులకు డీఎంకే మద్దతు

రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించిన డీఎంకే చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ సహా పలువురు పార్టీ సీనియర్‌ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మద్దతు అన్నదాతలకే అని స్టాలిన్ ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...