22.9 C
Hyderabad
Monday, January 18, 2021

సాగు చట్టాల రద్దుకే రైతన్నల పట్టు.. కొనసాగుతున్న ప్రతిష్టంభన

కొత్త సాగు చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.  నేడు జరిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలించలేదు. దీంతో జనవరి 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తేనే తాము నిరసనను విరమించి ఇండ్లకు పోతామని రైతు ప్రతినిధిలు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ సాగు చట్టాల రద్దు మినహా మిగతా అంశాలపై మాత్రమే చర్చిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేయడంతో చర్చలో ఎలాంటి పురోగతి లేకుండానే సమావేశం ముగిసింది.

41 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. దేశ ప్రజలందరి కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చామని, ఇవి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని మంత్రుల బృందం రైతు సంఘాల ప్రతినిధులకు తెలిపింది. చట్టాలను రద్దు చేయడం కుదరదని కావాలంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్లండని కాస్తా గట్టిగానే చెప్పినట్లు సమాచారం. దీనిపై రైతు ప్రతినిధుల నుంచి అభ్యంతరం వచ్చినట్లు తెలుస్తోంది.

అత్యున్నత న్యాయాస్థానంలో సమస్య తేలేందుకు సమయం పడుతుందని, కాబట్టి సాగు చట్టాలను ప్రభుత్వమే వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాలు పట్టుబట్టినట్లు సమాచారం. రైతు ప్రతినిధులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో మంత్రులు గది నుంచి బయటకు వచ్చేసి అధికారులతో చర్చించారు. రైతు సంఘాల నేతలు సమావేశ గదిలోనే మౌనంగా కూర్చుని ‘విజయం లేదా వీరమరణం’ అనే రాసి ఉన్న పేపర్లు పట్టుకుని నిరసన తెలిపారు. భోజనం చేసేందుకు కూడా రైతులు నిరాకరించి గదిలోనే మౌనంగా ఉండిపోయారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...