కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టుకెక్కింది. కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని రైతు సంఘాల నేతలు తమ పిటిషన్లో వాదించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 16 రోజులుగా దేశ రాజధానిలో పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు పలుమార్లు చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదు. తాజాగా కేంద్రం పంపిన ప్రతిపాదనలను కూడా రైతులు తిరస్కరించారు. ఈ చట్టాలను నిరసిస్తూ.. డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.