29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. కదం తొక్కుతున్న రైతులు

72వ గణతంత్ర దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరుగుతున్న వేళ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు కదం తొక్కుతున్నారు.  పోలీసు బ్యారికేడ్లను ఛేదించుకుని రైతులు ట్రాక్టర్లతో దూసుకుపోతున్నారు. పరేడ్ కార్యక్రమాలు ముగిసిన అనంతరం తాము ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేసినప్పటికీ.. ఉదయం 8 గంటల ప్రాంతంలో రైతులు ఒక్కసారిగా ర్యాలీ తీసేందుకు సిద్ధమవ్వడం ఉద్రిక్తలకు దారితీసింది.

సింఘు,  టిక్రి, ఘూజీపుర్ బోర్డర్లలో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘాలు పేర్కొన్నప్పటికీ వాస్తవంగా అక్కడ ఆ పరిస్థితులు కన్పించడం లేదు. భారీ సంఖ్యలో ఉన్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టిక్రి సరిహద్దుల్లో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా 50 వేల ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్ శాంతియుతంగా చేపడుతామన్న రైతులు అంతకు మూడింతల ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ నుంచి గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బార్డర్ కి చేరుకున్నారు.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్లతో కిసాన్ గణతంత్ర పరేడ్ ని నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. కానీ ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ముగిసాక మాత్రమే చేపట్టేందుకు పోలీసులు రైతు సంఘాల నేతలకు అనుమతిచ్చారు.  

- Advertisement -

Latest news

Related news