22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాయి. సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో సుమారు 3500పైగా ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టినట్లు భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) చీఫ్ జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర, చట్టపరమైన హామీ ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరసన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

జనవరి 26న రిపబ్లిక్ పరేడ్‌ సందర్భంగా నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీకి సన్నాహకంగా ట్రాక్టర్ మార్చ్ చేపట్టామన్నారు. ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీస్‌ సిబ్బందిని భారీగా మోహరించారు. తీవ్రమైన చలి, వర్షాలు కురుస్తున్నా పట్టువీడకుండా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 40 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో ఇరువర్గాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరుగనున్నాయి.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...