32.7 C
Hyderabad
Monday, March 1, 2021

‘పార్లమెంట్ మార్చ్’ రద్దు చేసిన రైతులు

కిసాన్ గణతంత్ర పరేడ్ లో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తల నేపథ్యంలో ఫిబ్రవరి 1 న రైతులు చేపట్టాలనుకున్న పార్లమెంట్ మార్చ్ ను రైతు సంఘాల నేతలు రద్దు చేశారు. దీనికి బదులుగా ఈ నెల 30న మహాత్మా గాంధీ వర్ధంతి రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.

వారితోనే హింస

కొత్త సాగు చట్టాలను  కేంద్రం రద్దు చేసేవరకు తమ ఆందోళన ఆగదని రైతు నేతలు  మరోమారు స్పష్టం చేశారు. శాంతియుతంగా సాగుతుందనుకున్న ట్రాక్టర్ ర్యాలీలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు పాల్గొన్న ఫలితంగానే అది హింసాత్మకంగా మారిందన్నారు.

20 మందికి నోటీసులు

కిసాన్ ర్యాలీ హింసాత్మ‌క ఘటనలకు సంబంధించి యోగేంద్ర యాద‌వ్‌, బాల్‌దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్‌తో పాటు 20 మంది రైతు ప్ర‌తినిధుల‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. వాటికి మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసుల్లో రైతు నేతలను పోలీసులు ఆదేశించారు.

హోం మంత్రి పరామర్శ

కిసాన్ ర్యాలీలో గాయ‌ప‌డ్డ పోలీసులు, సైనికులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉద‌యం ప‌రామ‌ర్శించారు. వారి ఆరోగ్య ప‌రిస్థితిని డాక్టర్లను అడిగి తెలసుకున్నారు.

- Advertisement -

Latest news

Related news