హరియాణాలోని ఖైతల్ దుంద్రేహీ గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ గోయత్ అనే రైతు తన కొడుకు పెళ్లి కార్డుపై.. రైతులు లేకపోతే తిండి లేదు అనే లోగోను ప్రింట్ చేయించాడు. రైతు ఉద్యమానికి తనవంతు సపోర్ట్ గా ఇలా చేశానని చెప్తున్నాడు. ట్రాక్టర్ పై రైతు ఉన్న ఫొటో.. దానికింద నో ఫార్మర్స్ నో ఫుడ్ అనే టెక్స్ట్ ముద్రించాడు. అంతే కాదు వెడ్డింగ్ కార్డుపై చోటురాం భగత్ సింగ్ ఫొటోలు కూడా రెండు వైపులా ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
