29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

చర్చలకు మేమూ రెడీ

ఆదివారం ఢిల్లీ సరిహద్దుల్లో 67 వ రోజు కూడా రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.వివిధ ప్రాంతాలనుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఇంకా వస్తూనే ఉన్నారు. పంజాబ్‌లోని నుంచి 250 ట్రాక్టర్లలో 1500మంది రైతులు, మొహాలీ నుంచి 250 ట్రాక్టర్‌ లు పెద్ద సంఖ్యలో రైతులు సింఘూకు చేరుకున్నారు. అటు ఉత్తరప్రదేశ్‌ అంతటా రైతుల ధర్నాలు, రాస్తా రోకోలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పశ్చిమ యూపీలో కిసాన్‌ మహాపంచాయత్‌ జరిగింది. సాగు చట్టాల వల్ల రైతుల ఆదాయం పడిపోతుందని, కార్పొరేట్ల రాజ్యం మొదలవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ అన్నారు.
ఫిబ్రవరి 2న రైతులతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే విషయంలో తాము ఎటువంటి ఒత్తిళ్లకూ లోను కామని, చర్చలు జరగాలంటే ముందుగా అరెస్టైన తమ నేతలను విడుదల చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. తమకు కూడా చర్చలు జరపాలనే ఉన్నదని, మోదీ కూడా తమకూ ప్రధానే అన్నారు. అయితే చట్టాల రద్దు డిమాండ్‌ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కూడా పరోక్షంగా తేల్చిచెప్పారు. చట్టాలను రద్దు చేయడం ఎందుకు సాధ్యం కాదో రైతులకు చెప్పాలని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. “ప్రపంచం ముందు దేశం తలదించుకొనే పనిని మేమీదీ చెయ్యం. అదే సమయంలో రైతులకూ ఆత్మగౌరవం ముఖ్యం” అన్నారు. రిపబ్లిక్ డే రోజు జరిగిన పరిణామాలు కొందరి కుట్ర అని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు వాటితో సంబంధం లేదని తికాయత్‌ చెప్పారు.

- Advertisement -

Latest news

Related news