రోజురోజకీ ఇష్యూగా మారుతున్న వ్యయసాయ చట్టాల బిల్లుపై ఎవరి దారి వారిదన్నట్టుగానే ఉంది వ్యవహారం. రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య శుక్రవారం జరిగిన 11వ దఫా చర్చలు కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు పక్షాలూ బెట్టు వీడట్లేదు. చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేసేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదిస్తే.. వాటిని పూర్తిగా రద్దుచేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పారు. ఈ రకంగా చూస్తే 26న ర్యాలీ జరిగేలా కనిపిస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా 26 న ట్రాక్టర్ ర్యాలీ జరిపితీరుతామని చెప్తోంది. పోరాటాన్ని ఆపేది లేదని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు అంటున్నారు. మరోపక్క ర్యాలీపై ఢిల్లీ పోలీసులతో రైతు సంఘాల నేతల చర్చలు కూడా కొలిక్కిరాలేదు. ఈ రోజు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.