రైతుల ఆందోళనపై ట్వీట్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఒక ట్వీట్ చేసింది. “శాంతియుతంగా సమావేశమై నిరసన వ్యక్తం చేసే హక్కును పరిరక్షించాలి, అటు ప్రభుత్వం, ఇటు రైతులు పూర్తి సంయమనం పాటించాలి. సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం సాధించాలి” అని ట్వీట్ ద్వారా సూచించింది.
ఇదిలా ఉంటే పాప్ సింగర్ రిహానా ట్వీట్‌కు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే లైక్ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదొక్కటే కాదు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం సమయంలో ప్రత్యేకంగా ఓ ఎమోజీని తయారు చేసినట్టు ఇప్పుడు రైతు ఆందోళనలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లపై ట్విటర్ ప్రత్యేకంగా ఓ ఎమోజీని రూపొందించి పెట్టాలని వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ సూచించారు. దానికి కూడా ట్విట్టర్ సీఈవో డోర్సే లైక్ కొట్టారు. ఇలా ఇప్పటికీ ట్విట్టర్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ట్రెండింగ్ లోనే నడుస్తోంది.
