29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రైతు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేపట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తల నడుమ ముగిసిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు  200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసలో300 మంది పోలీసులు, సైనికులు గాయపడ్డట్టు అధికారులు చెప్పారు.

రైతు సంఘాల నేతలు రాకేశ్ తికాయట్, దర్శన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటాసింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ లతోపాటు ఇతర రైతు సంఘాలు, రైతులపై దాదాపు 22 ఎఫ్ఐఆర్ లు బుక్ చేశారు. వీరిపై హింస, విధ్వంసం, హత్యాయత్నం, దోపిడీ లాంటి కేసులను పోలీసులు నమోదు చేశారు. అన్ని కేసుల దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Latest news

Related news