32.7 C
Hyderabad
Monday, March 1, 2021

కాల్పుల వర్షం కురిపించే ఫైరింగ్‌ షూ

మామూలుగా సైనికులు తుపాకులతో శత్రవులపై కాల్పులు జరుపుతారు. అవే కాల్పులు షూస్‌తో జరిపితే ఎలా ఉంటుంది. చేతిలో తుపాకీ పట్టుకోకుండా కాలికి ధరించిన చెప్పులతోనే బుల్లెట్ల వర్షం కురిపిస్తే శత్రువు షాక్ అవ్వడం ఖాయం. ఇలాంటి సరికొత్త ఐడియానే డెవలప్ చేశాడు. వారణాసికి చెందిన యంగ్ సైంటిస్ట్ శ్యామ్ చౌరాసియా. అసలీ షూ ఎలా పని చేస్తుందంటే…


దూరం నుంచే పసిగట్టి..
వారణాసిలోని ఓ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న శ్యామ్ ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఫైర్ షూస్‌ని తయారుచేశాడు. ఒక్కోటి ఆరుకేజీల బరువుండే ఈ షూలో రెండు మడతపెట్టిన 9mm గన్ బ్యారెల్స్ ఉంటాయి. ఇవి సౌండ్ ఆధారంగా శత్రువుల రాకను కనిపెడతాయి. రబ్బర్, స్టీల్ ప్లేట్లను మిక్స్ చేసి తయారుచేసిన ఈ షూ రేడియో ఫ్రీక్వెన్సీలు, మొబైల్ నెట్‌వర్క్‌ను కూడా డిటెక్ట్ చేస్తాయి. అంతేకాదు సోలార్ ఛార్జింగ్ , స్టీల్ షీట్, ఎల్‌ఈడీ లైట్, సోలార్ ప్లేట్ రేడియో సర్క్యూట్, స్విచ్ అండ్ వైబ్రేషన్ మోటర్, ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్ కూడా ఇందులో ఉన్నాయి.


షూతోనే ఫైరింగ్
దీని గురించి శ్యామ్ మాట్లాడుతూ.. “ఈ ఫైర్ షూతో కనెక్ట్ అయి ఉండే లేజర్ సెన్సార్, హ్యూమన్ సెన్సార్‌లను బోర్డర్ దగ్గర సెట్ చేయాలి. అప్పుడు శత్రువులు ఎవరైనా బోర్డర్ దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తే వెంటనే షూస్‌కు ఉండే సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే షూస్‌కి సిగ్నల్స్ వెళ్లిపోతాయి. షూ వెంటనే అలర్ట్ సౌండ్ చేస్తుంది. సైనికులు కూడా అలర్ట్ అయ్యి ఫైర్ చేయాలనుకుంటే షూతోనే ఫైరింగ్ చేయొచ్చు. ఈ షూ ముందు, వెనుక రెండు వైపుల నుంచి ఫైరింగ్ చేయగలదు. ఇది మైనస్ డిగ్రీల వాతావరణంలో పని చేస్తూ.. వేసుకున్న సైనికులకు వెచ్చదాన్నిస్తాయి.” అన్నాడు. ఈ ఫైరింగ్ షూ కాన్సెప్ట్ గురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్టు కూడా చెప్పాడు.

- Advertisement -

Latest news

Related news