29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

బడ్జెట్ ప్రతులు లేకుండా.. తొలిసారి కేంద్ర బడ్జెట్

ఎప్పట్లా చేతిలో బడ్జెట్ ప్రతులతో కాకుండా.. ఈ సారి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పేపర్లు లేని బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. గతంలో లెదర్ సూట్ కేసుల్లో బడ్జెట్ కాపీలను పార్లమెంట్ కు తెచ్చేవారు. 2019, 2020 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదాయ బాహీ ఖాటాలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు.
1947 నవంబరు 26న తొలిసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది బడ్జెట్ పత్రాలు ముద్రించి సభ్యులకు బడ్జెట్ కాపీలు ఇచ్చి.. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశానికి రెండు వారాల ముందు ప్రింటింగ్ మొదలుపెడుతారు. కానీ.. ఈ సారి కరోనా వల్ల బడ్జెట్ పత్రాలు ముద్రించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు సైతం సమ్మతించడంతో ఈసారి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ కాపీలకు బదులుగా సభ్యులకు సాఫ్ట్ కాపీలను పంచారు. పార్లమెంట్ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయన ఇంట్లో బడ్జెట్ ట్యాబ్ కు ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Latest news

Related news