29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

గుడ్లు,మాంసం ఎలా తినాలో చెప్పిన ఫుడ్ కార్పొరేషన్

దేశంలో చాలా చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జనాలకు నాన్ వెజ్ తినడంలో అనుమానాలు, భయాలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా జాతీయ ఫుడ్ కార్పొరేషన్ సరికొత్త నిబంధనలను విడుదల చేసింది. ముఖ్యంగా మాంసం, గుడ్లు ఎలా తినాలి అనేదానిపై ఒక ప్రత్యేక పట్టిక విడుదల చేసింది.
అందులో ఏం చెప్పారంటే..
హాఫ్ బాయిల్డ్ గుడ్లు తినకూడదు
సరిగ్గా ఉడికించని చికెన్ తినకూడదు
పక్షులు లేదా పక్షులు ఉండే ప్రాంతాల్ను ముట్టుకోవద్దు. దగ్గరగా ఉండకూడదు.
చనిపోయిన పక్షులను తాకొద్దు.
పచ్చి మాంసాన్ని కూడా డైరెక్ట్ గా ముట్టుకోవద్దు.
పచ్చి మాంసాన్ని తెచ్చిన వెంటనే గ్లోవ్స్, మాస్క్ పెట్టుకుని శుభ్రం చేయాలి.
చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
చికెన్, గుడ్లు అలాగే వాటికి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ ను ఎక్కువ టెంపరేచర్ దగ్గర కుక్ చేసిన తర్వాతే తినాలి.
చికెన్ ను కనీసం 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించి తినాలి.

- Advertisement -

Latest news

Related news