అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. నిర్మాణ స్థలిలో జరిపిన భూసార పరీక్షల నివేదికలు అందగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు దానిపై భారీ గాజు గోపురం ఉంటుందని జాఫర్ చెప్పారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2019 సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.