32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఉన్నట్టుండి పొంగిన ధౌలీగంగ.. 150 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ధౌలీగంగా నది ఆకస్మికంగా ఉప్పొంగింది. పర్వత ప్రాంతాల్లోని మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో గంగానదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. దీంతో నది ఉప్పొంగి.. ప్రవహించింది. రైనీ తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టు వరద నీటి ధాటికి కొట్టుకుపోయింది. రుషిగంగ పవర్ ప్రాజెక్టు సైతం భారీగా దెబ్బతిన్నది. ఈ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 150 కార్మికులు వరదలో చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలకు దిగింది.
నది పరీవాహక ప్రాంతాల గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎసడీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసంరెండు ఎంఐ-17లతో పాటు ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ చాపర్‌ను కూడా వాయుసేన అధికారులు రంగంలోకి దింపారు.

- Advertisement -

Latest news

Related news