సామాన్యుడిపై ఆయిల్ కంపెనీలు మరో గుదిబండను మోపాయి. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్య జనంపై మరో పిడుగు పడింది. రాయితీ కింద అందుతున్న సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రాయితీ సిలిండర్ మీద రూ.50 పెరిగింది.
14.2 కేజీల సిలిండర్ ధర రూ. 50 పెరుగగా, 5 కేజీల చిన్న సిలిండర్ ధర రూ. 18 పెరిగింది. 19 కేజీల సిలిండర్ ధర రూ. 36.50 పెరిగింది. పెరిగిన రాయితీ సిలిండర్ ధరలతో ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ. 644కు చేరగా, కోల్కతాలో రూ. 670.50, ముంబైలో రూ. 644, చెన్నైలో రూ. 660కు చేరింది.