పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన తాతాజీ నాయుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పావని.. గతేడాది నుంచి తనను పెళ్లి చేసుకోమ్మని తాతాజీని అడుగుతూ వస్తుంది. అందుకు తాతాజీ నిరాకరిస్తున్నాడు.
మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడేమో అని అనుమానించిన పావని.. సోమవారం నాడు తనను కలవాల్సిందిగా తాతాజీని కోరింది. ఇద్దరూ మలకపల్లిలో కలుసుకున్నారు. తిరిగి.. పావనిని ఆమె ఇంటి దగ్గర దింపడానికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుక కూర్చున్న పావని కత్తితో తాతాజీ వీపుపై పొడిచింది. కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై కత్తితో దాడ చేసింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు చూసి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.