23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అమ్మాయిలకు ఫోన్ ఇస్తలేరు

మన దేశంలో సుమారు 42శాతం మంది అమ్మాయిలు రోజుకి గంటకన్నా తక్కువసేపు ఫోన్లు ఉపయోగిస్తున్నారట. సెంటర్ ఫర్ కేటలైజింగ్ చేంజ్ అనే సంస్థ, డిజిటల్ ఎంపవర్ మెంట్ ఫౌండేషన్ కలిసి నిర్వహించిన సర్వేలో మన దేశంలో అమ్మాయిలకు ఫోన్ ఇవ్వట్లేదని తేలింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో 4,100 మంది టీనేజ్‌ అమ్మాయిలపై నిర్వహించిన సర్వే వివరాలను ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వెల్లడించారు.


దేశంలో చాలామంది అమ్మాయిలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని ఈ సర్వేలో తేలింది. టీనేజ్‌ అమ్మాయిలు ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు వాడడం వల్ల దారి తప్పుతారని పెద్దలు భయపడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే డిజిటల్‌ వినియోగం తమ అమ్మాయిల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్న భయం కూడా ఉంది.


కర్ణాటకలో 65శాతం అమ్మాయిలకు డిజిటల్‌ పరికరాలు అందుబాటులో ఉండగా, హర్యానాలో చాలా తక్కువ శాతం మంది అమ్మాయిలు వినియోగిస్తున్నారు. మన తెలంగాణలో మాత్రం డిజిటల్‌ పరికరాల వినియోగంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తేడా 12 శాతం ఉంది.

- Advertisement -

Latest news

Related news