19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

మరింత పెరిగిన బంగారం ధరలు.. తులానికి రూ.50 వేలు

బంగారం ప్రేమికులకు చేదు వార్త. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం ధర తాజాగా మరోసారి పెరిగింది. పెరిగిన బంగారం ధరలు ఆల్ టైం రికార్డును సృష్టించాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,180కి చేరింది. మరోవైపు  వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. ఇటీవల వెండి కిలో ధర రూ.60 వేలు దాటిన విషయం తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా స్థిరంగా రూ.66,800 వద్ద కొనసాగుతుంది.

కరోనాకు వ్యాక్సిన్ వస్తుందన్న వార్తల దృష్ట్యా గత రోజులుగా పసిడి ధరలు కాస్తా తగ్గుతూ వస్తూన్నాయి. వెండి కూడా బంగారం దిశలోనే నడుస్తుంది. అయితే.. ఒక్కసారిగా బంగారం ధరలు సుమారు 40 శాతం వరకు పెరిగాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం రేటుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...