కరోనా మహమ్మారి వల్ల గతేడాది జరిగిన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రచనా సింగ్ వేసిన పిటీషన్ను సుప్రీం నేడు విచారించింది. గతేడాది అక్టోబర్లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అయితే ఆ ఏడాది చివరి అటెంప్ట్ చేస్తున్న వారిలో కొందరు కోవిడ్ వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయారు. దాంతో పరీక్ష మిస్సైనవారికి మరో అవకాశం కల్పించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.