‘త్వరలో డ్యుయో ఆగిపోనుంది. మీరు గూగుల్ ధృవీకరించని డివైజ్ వాడుతున్నారు. మీ అకౌంట్ ని ఈ డివైజ్ నుంచి తొలగించడం జరుగుతుంది.’ అనే మెస్సేజ్ మీ ఫోన్ కి వచ్చిందా.. అయితే మీ ఫోన్లో త్వరలో డ్యుయో యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. నోకియా, శామ్సంగ్, వన్ప్లస్, వివో, ఒప్పోతోపాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని తెలుస్తోంది. గూగుల్ నుంచ సర్టిఫైడ్ పొందని కంపెనీలకు చెందిన ఫోన్లలో డ్యుయో సేవలు త్వరలో నిలిచిపోనున్నట్లు సమాచారం. గూగుల్ ప్లే సర్వీసెస్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. గతంలో కూడా ఇలాగే కొన్ని మొబైల్ ఫోన్లలో గూగుల్ మెస్సెజెస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.