29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఎనిమిదేళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్..

ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ తీసుకుని ఎనిమిదేళ్లు దాటిందా? అయితే.. ఇక నుంచి గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సిందే..


కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై కేంద్రం చర్యలు చేపడుతోంది. ఎనిమిదేళ్లకు పైగా పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా సంతకం చేశారు.


కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్ చేసుకునే సమయంలో ఈ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే, 15 సంవత్సరాలు పైబడిన వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. అంటే అందరూ వాడుకునే మామూలు వాహనాలు. ఇవి కూడా పదిహేనేళ్లు దాటిన తర్వాత.. వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ సమయంలో గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అయితే హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ లాంటి ఇంధనాలతో తిరిగే వాహనాలకు ఈ ట్యాక్స్ వర్తించదు.

- Advertisement -

Latest news

Related news