29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఆన్‌లైన్‌లో మోసపోయిన సీఎం కూతురు

ఆన్‌లైన్‌లో మోసాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే.. అవతలి వాళ్లు ఎవరైనా డోంట్ కేర్ అంటున్నారు మోసగాళ్లు. ఆఖరికి సీఎం కూతర్ని కూడా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుమార్తె హర్షితా కేజ్రీవాల్.. ఓ కేటుగాడి చేతిలో మోసపోయింది.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఇంట్లో ఉన్న సోఫాను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. అయితే ఓ మోసగాడు హర్షిత పెట్టిన సోఫా సెట్ బాగుందని, తాను కొంటానని నమ్మించాడు. సోఫా సెట్ కోనేందుకు గానూ కొంత మొత్తాన్ని అకౌంట్ కు పంపిస్తానని, దానికోసం తాను పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అతడి మాయమాటల్ని నమ్మిన హర్షిత చెప్పినట్లు చేసింది. అంతే ఆమె అకౌంట్‌లో ఉన్న 20వేలు మాయమయ్యాయి. అదేంటీ నా అకౌంట్లో ఉన్న డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ప్రశ్నించగా.. పొరపాటుగా వేరే క్యూఆర్ కోడ్ పంపానని, ఇప్పుడు మరో క్యూఆర్ కోడ్ లింక్ పంపిస్తున్నాను.. స్కాన్ చేయమని చెప్పాడు. నిందితుడి మాయమాటల్ని నమ్మిన హర్షిత మరోసారి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడంతో అకౌంట్ లో ఉన్న రూ.14వేలు మాయమయ్యాయి. అప్పటికి అసలు విషయం గ్రహించిన హర్షిత కేటుగాడి చేతిలో మోసపోయానని తెలుసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news