ఏటా 17 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్, పొల్యూటెడ్ సిటీస్, కూర్చుని చేసే జాబ్ లు.. ఇలా కారణాలేవైనా.. వాటన్నింటికి ఎఫెక్ట్ మాత్రం గుండె మీదే పడుతుంది. అందుకే గుండెను పదిలంగా కాపాడుకోవడం ఎంతైనా ముఖ్యం.
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం మన దేశంలో ఏడాదికి 17 లక్షల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2.3 కోట్లకు చేరే అవకాశం ఉందని లెక్కలు చెప్తున్నాయి. గుండెపోటు వచ్చేవారిలో 25శాతం మందికి డయాబెటిస్ వల్లనే వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. అలాగే గ్రామాలలో నివసించే వారితో పోలిస్తే సిటీల్లో నివసించే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువగా ఉంటోంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే కొన్ని అలవాట్లను చేర్చుకోవాలి. కొన్ని అలవాట్లను మానుకోవాలి.
చాలా హార్డ్ డిసీజ్లకు ప్రధాన కారణం ధూమపానం. ఏడాది పాటు ధూమపానానికి దూరంగా ఉంటే, గుండె పోటు వచ్చే అవకాశాలు సగం తగ్గుతాయి. అలాగే లంగ్స్ అన్నీ మెల్లగా డీటాక్స్ అవుతాయి. కాబట్టి ఈ అలవాటు పూర్తిగా మానుకోవడం బెటర్.
వారానికి కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా శారీరక వ్యాయామం చేయాలి. అంటే రోజుకు కనీసం 30 నిమిషాల చొప్పున కేటాయిస్తే సరిపోతుంది.

డైట్ లో ఎక్కువ పీచుపదార్థం ఉండేలా చూసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి రోజుకు కనీసం 30 గ్రాముల పీచు పదార్థం తీసుకోవాలి. దాంతో పాటు కొవ్వులు, చక్కెర తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే గుండె సేఫ్ గా ఉండాలంటే.. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఉప్పు చాలా సమస్యలకు కారణం అవుతుంది.
వీటితో పాటు రోజువారీ డైట్ లో పండ్లు, కూరగాయలను చేర్చడం, నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్లు కూడా గుండె ఆరోగ్యానికి మంచివే.
