26 C
Hyderabad
Wednesday, January 27, 2021

చెన్నమనేని రమేష్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖపై హైకోర్టు అసహనం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం విషయమై కేంద్ర హోం శాఖ  మీద ఇయ్యాల  హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ కాకుండా, కేవలం మెమో దాఖలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర హోం శాఖ తీరుని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోవడమే గాక.. ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అని  ప్రశ్నించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే కేంద్ర హోంశాఖ మళ్ళీ  ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మరో మారు అవకాశం ఇస్తున్నాం.. జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయండి’ అని కేంద్ర హోంశాఖకు సూచించింది. ఇదిలా ఉండగా, చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18న కేంద్ర హోం శాఖను హైకోర్టు ఆదేశించినప్పటి పురోగతి లేకపోవడంతో హై కోర్ట్ కేంద్ర హోం శాఖ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

- Advertisement -

Latest news

Related news

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...