హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితుల వేద ఆశీర్వచనలు అందించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కరోన నుంచి యావత్ ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ను తెలుగు వారు కనుగొనటం గర్వించదగ్గ విషయమన్నారు. వివేకానంద స్పూర్తితో యువత ముందడుగు వేయాలన్నారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.