29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

విదేశాల్లో స్కూల్స్ ఇలా నడుస్తున్నయ్

తెలంగాణలో ఫిబ్రవరి 1(రేపటి) నుంచి 9,10 క్లాసులతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తరగతి గదులను శానిటైజ్ చేయడంతోపాటు స్టూడెంట్స్ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి చేశారు. టీచర్లు, స్టూడెంట్స్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విదేశాల్లో ఇప్పటికే ప్రారంభమైన స్కూల్స్ ఎలా నడుస్తున్నాయో ఓసారి లుక్కేద్దామా..

చైనా

స్కూల్స్ ప్రారంభమైన మొదట్లో ప్రతి స్టూడెంట్ కి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటికీ స్టూడెంట్స్ కి డైలీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక కరోనా వైరస్ పుట్టినిల్లు వుహాన్ లో ప్రతి స్టూడెంట్స్ కి డైలీ యాంటీజెన్ టెస్టులు తప్పనిసరిగా చేస్తున్నారు.

నెదర్లాండ్

స్కూల్లో స్టూడెంట్స్ మధ్య ప్లాస్టిక్ షీల్డ్ లు, ప్లెక్సీ గ్లాజ్ లు ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అవ్వకుండా టీచర్ల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే స్టూడెంట్స్, టీచర్లు మాస్కులు ధరించడం తప్పనిసరి కాదక్కడ.

డెన్మార్క్

క్లాసులను షిఫ్టుల వారీగా నిర్వహిస్తున్నారు. ఒక్కో షిఫ్టుకు వచ్చిపోయేందుకు సఫరేటు ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు. టీచింగ్ సమయం తగ్గించారు. టీచర్లు, స్టూడెంట్స్ మధ్య వీలైనంత వరకు ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా చూడాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫ్రాన్స్

గతేడాది జూన్ లోనే స్కూల్స్ తెరిచినా.. స్టూడెంట్స్ హాజరు కావడం తప్పనిసరి చేయలేదు. సెప్టెంబర్ నుంచి స్టూడెంట్స్ హాజరు తప్పనిసరి చేశారు. స్టూడెంట్స్, టీచర్స్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి.

ఇటలీ

గతేడాది సెప్టెంబర్ చివరిలో స్కూల్స్ ప్రారంభమయ్యాయి. స్టూడెంట్స్ మధ్య మీటర్ దూరం తప్పనిసరి. ఇందుకు తగ్గట్టుగా క్లాస్ రూములను మార్చారు. క్లాస్ లు సరిపోకపోతే ఆరుబయట కూడా క్లాస్ లు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. సిలబస్ పూర్తి చేసేందుకు వీకెండ్ లోనూ క్లాస్లు తీసుకుంటున్నారు.

కెనడా

స్టూడెంట్స్, టీచర్లు మాస్కులు, ఫేస్ షీల్డ్ లను ధరించాల్సిందే. భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం లాంటివి తప్పనిసరి. క్లాసులోని స్టూడెంట్స్ ని గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 6గురు స్టూడెంట్స్ ఉంటారు. గ్రూపుల మధ్య కనీసం ఒక మీటరు దూరం.. గ్రూపులకు టీచర్ 2 మీటర్ల దూరంలో ఉండి పాఠాలు చెబుతారు.

స్పెయిన్

గతేడాది సెప్టెంబర్ నుంచే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్ బోధనలో వెనుకబడకుండా 11 వేల మంది టీచర్లను ప్రత్యేకంగా రిక్రూట్ చేశారు. క్లాసులను షిఫ్ట్ ల వారీగా నిర్వహిస్తున్నారు. 15-20 మంది స్టూడెంట్లతో బయోబబుల్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూపుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి.

- Advertisement -

Latest news

Related news